దక్షిణ కొరియా ప్రభుత్వన్వానం మేరకు ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఈ నెల 11 వరకు.పర్యటన
దక్షిణ కొరియా ప్రభుత్వన్వానం మేరకు ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఈ నెల 11 వరకు.పర్యటన
Lokesh


అమరావతి, 05 జూలై (హి.స.)

దక్షిణ కొరియా ప్రభుత్వ ఆహ్వానం మేరకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ ఆ దేశంలో పర్యటించనున్నారు. ఆదివారం నుంచి ఈ నెల 11 వరకు పర్యటన ఉండనుంది. లోకేశ్ శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి దక్షిణ కొరియా బయల్దేరి వెళ్లారు. ఆదివారం ఉదయం ఆయన కొరియా రాజధాని సియోల్కు చేరుకుంటారు. పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ కొరియాలో వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో అధికారిక సమావేశాల్లో పాల్గొంటారు. భారత్, దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్ (చెన్నై) చాంగ్ న్యూన్ కిమ్ మంత్రి లోకేశ్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆదివారం దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఇండియా డయాస్పోరా ఆత్మీయ సమావేశానికి లోకేశ్ హాజరవుతారు. 6న దక్షిణ కొరియా టెక్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం, వివిధ కంపెనీలతో పెట్టుబడి చర్చల్లో లోకేశ్ పాల్గొంటారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande