గోదావరి నది. మీదుగా కొనసాగే ఆర్చి వంతెన పై రైల్వే శాఖ.నిర్వహణ పనులు
గోదావరి నది. మీదుగా కొనసాగే ఆర్చి వంతెన పై రైల్వే శాఖ.నిర్వహణ పనులు
godavari


అమరావతి, 05 జూలై (హి.స.)

చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో గోదావరి నది మీదుగా కొనసాగే ఆర్చి వంతెన ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. అటువంటి వంతెన సామర్థ్యం దెబ్బతినకూడదని, మరికొన్నేళ్లు విశేష సేవలందించాలని భావించిన రైల్వే శాఖ నిర్వహణ పనులను చేపడుతోంది. విజయవాడ రైల్వే డివిజన్లోనే అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో.. రైళ్ల ట్రాఫిక్ నిలుపుదల చేయకుండా పనులు చేయడం రైల్వే చరిత్రలోనే తొలిసారని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

గోదావరిపై రాజమహేంద్రవరంలో 2.888 కి.మీ మేర ఉన్న (గోదావరి బౌ స్ట్రింగ్ ఆర్చ్ బ్రిడ్జి 248) వంతెనకు 28 స్పాన్లు ఉన్నాయి. వీటిలో 20 స్పాన్ల (71.4 శాతం) పనులు పూర్తి చేశారు. వంతెనపై ఉన్న హ్యాంగర్ కేబుళ్లు తుప్పుపట్టడంతో వాటినీ మార్చే ప్రక్రియ చేపట్టారు. మొత్తం 672 హ్యాంగర్ కేబుళ్లకుగాను ఇప్పటికే 500 వరకు కేబుళ్లను (74.4 శాతం) ఆధునిక పద్ధతిలో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా మార్చారు. నైపుణ్యం ఉన్న అధికారుల పర్యవేక్షణలో కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పనులు చేస్తున్నారు.

వంతెనపై ఉన్న హ్యాంగర్ కేబుళ్లు భవిష్యత్తులో తుప్పుపట్టకుండా యూరప్ నుంచి నాలుగు లేయర్ల సామర్థ్యం ఉన్న యాంకరేజ్లను వినియోగించారు. ఇటలీకి చెందిన అంతర్జాతీయ కేబుల్స్ నిపుణులు, ఐఐటీ ముంబయి ఇంజినీర్ల పర్యవేక్షణలో స్ట్రెస్సింగ్ మెథడాలజీని రూపొందించారు.వంతెన దిగువన పర్యవేక్షణకు ఆస్ట్రేలియా నిపుణుల సహాయంతో 272కు మించి స్మార్ట్ సెన్సార్లు, ‘బ్రిడ్జ్ హెల్త్ మానటరింగ్ సిస్టమ్’ (బీహెచ్ఎంఎస్)ను అమర్చారు. రాజమహేంద్రవరంలోని ల్యాబ్కు అనుసంధానం చేయడంతో సెన్సార్ల ద్వారా గాలి వేగం, ఆర్చి కదలికలు, వంతెనపై భారం తదితర వివరాలను ఇది నిరంతం చేరవేస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande