సముద్రంలో బోటుంగల్లంతు ఘటన చాలా బాధాకరం.. ఎమ్మెల్యే లోకం మాధవి
సముద్రంలో బోటుంగల్లంతు ఘటన చాలా బాధాకరం.. ఎమ్మెల్యే లోకం మాధవి
సముద్రంలో బోటుంగల్లంతు ఘటన  చాలా బాధాకరం..  ఎమ్మెల్యే లోకం మాధవి


విశాఖపట్నం,, 05 జూలై (హి.స.)

ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లి సముద్రంలో బోటు గల్లంతైన ఘటన చాలా బాధాకరమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి తెలిపారు. మత్స్యకారులు గంటలో తీరానికి చేరుకుంటామని చెప్పిన వెంటనే ఈ ఘటన జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్లో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్తో కలిసి ఆమె పరామర్శించారు. అనంతరం నెల్లిమర్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గల్లంతైన మత్స్యకారుల్లో ఆరుగురు నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన వారని వివరించారు. ఆ మత్స్యకారుల కుటుంబాల బాధ వర్ణనాతీతమని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా జరుగుతున్నాయని వివరించారు. గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande