హైదరాబాద్లో హరియాణా పోలీసుల సెర్చ్ ఆపరేషన్.. అదుపులోకి కరుడుగట్టిన నేరస్థుడు
హైదరాబాద్లో హరియాణా పోలీసులు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లో దోపిడీ కేసుకు సంబంధించిన ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Criminal


హైదరాబాద్, 05 జూలై (హి.స.)హైదరాబాద్లో హరియాణా పోలీసులు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లో దోపిడీ కేసుకు సంబంధించిన ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది. హరియాణాలో నమోదైన ఓ దోపిడీ కేసు దర్యాప్తులో భాగంగా ఆ రాష్ట్ర పోలీసుల ప్రత్యేక బృందం హైదరాబాద్కు చేరుకుంది. స్థానిక ఐఎస్ సదన్ పోలీసుల సహకారంతో చంపాపేటలోని దుర్గా భవానీ నగర్ ప్రాంతంలో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లో నిందితుడు యశ్వంత్ను అదుపులోకి తీసుకున్నారు.

యశ్వంత్ను కరుడుగట్టిన పాత నేరస్థుడిగా గుర్తించారు. హరియాణాలో జరిగిన దోపిడీ కేసులో అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా అతడిని అదుపులోకి తీసుకుని హరియాణాకు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్ను అత్యంత గోప్యంగా హరియాణా పోలీసులు నిర్వహించారు. స్థానిక పోలీసుల సహకారంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

నిందితుడిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం ట్రాన్సిట్ ప్రక్రియ పూర్తి చేసి హరియాణాకు తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే, దోపిడీ కేసు స్వరూపం, నిందితుడి పాత్ర, ఇతర సహచరులు ఎవరైనా ఉన్నారా అనే అంశాలపై పోలీసులు ఇంకా అధికారికంగా పూర్తి వివరాలను వెల్లడించలేదు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande