
జమ్మూకశ్మీర్, 05 జూలై (హి.స.)
జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా భద్రతా దళాలు భారీ గాలింపు చర్యలు (కార్డన్ అండ్ సెర్చ్) చేపట్టాయి. షోపియాన్ పరిసర ప్రాంతంలో అనుమానాస్పద కదలికలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో ఆర్మీ, స్థానిక పోలీసులు కలిసి ఆదివారం ఉదయం ఈ ఉమ్మడి తనిఖీలు ప్రారంభించారు. ఈ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించడంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదులు ఎవరైనా నక్కి ఉన్నారేమోననే అనుమానంతో ఇళ్లను, పరిసర పొలాలను జల్లెడ పడుతున్నారు. స్థానిక ప్రజలు ఎవరూ ఇళ్ల నుండి బయటకు రాకూడదని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత కోసం అదనపు బలగాలను రంగంలోకి దించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi