అందుకే అలా మాట్లాడా.. YTD బోర్డు వివాదంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
అందుకే అలా మాట్లాడా.. YTD బోర్డు వివాదంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
MLA


హైదరాబాద్, 05 జూలై (హి.స.)

తెలంగాణ కాంగ్రెస్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు చర్చగా మారింది. మంత్రిపదవి ఆశిస్తున్న ఆయన ఇటీవల వ్యవహరిస్తున్న తీరు సొంత పార్టీతో పాటు ప్రత్యర్థి పార్టీలోనూ హాట్ డిస్కషన్ గా మారుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటనకు దూమ్మా కొట్టి అందరికీ షాకిచ్చిన రాజగోపాల్ రెడ్డి.. యాదగిరిగుట్ట దేవస్థానం (వైటీడీ) బోర్డు విషయంలో ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు.

రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు అందరూ పని చేయాలన్నారు. పదవులు ఉన్నా, లేకున్నా పార్టీ కోసం పనిచేస్తానన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై రాహుల్తో మాట్లాడానని కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగొద్దనే వైటీడీ బోర్డు విషయంలో ముక్కుసూటిగా మాట్లాడినట్లు చెప్పారు. అయితే యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు నూతన కార్యవర్గ ఏర్పాటుకు సంబంధించి తనకు కనీస సమాచారం కూడా ఇవ్వలేనది రాజగోపాల్ రెడ్డి ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గం యాదాద్రి జిల్లాలోనే ఉన్నప్పటికీ తనకు సమాచారం ఇవ్వలేనది ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం దారుణం అని మండిపడ్డారు. ఇందుకు సంబంధించి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనపై విధంగా స్పందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande