
మథుర, 05 జూలై (హి.స.)
ఉత్తరప్రదేశ్ లోని మథుర జిల్లాలో పోలీసులకు, ఒక నిందితుడికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో (ఎన్‌కౌంటర్) సదరు నిందితుడు గాయపడ్డాడు. మథుర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడి కాలికి బుల్లెట్ గాయమైంది. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుండి పోలీసులు ఒక అక్రమ పిస్టల్, లైవ్ బుల్లెట్లు మరియు ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుడు గతంలో జరిగిన పలు దోపిడీ కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని, అతనిపై ఇప్పటికే అనేక క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని మథుర పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi