తిరుమల భక్తులకు అలర్ట్.. రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల భక్తులకు అలర్ట్.. రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల


తిరుమల, 05 జూలై (హి.స.) తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ముఖ్య గమనిక జారీ చేసింది.

ఆలయంలో జరగనున్న విశేష ఉత్సవాల కారణంగా రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

దర్శనాల రద్దుకు కారణం ఇదే..

జులై 14న శ్రీవారి ఆలయంలో ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’, అలాగే జులై 17న ‘ఆణివార ఆస్థానం’ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ వేడుకల నేపథ్యంలోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

సిఫార్సు లేఖల నిలిపివేత..

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దయిన కారణంగా, వాటికి ముందు రోజులైన జులై 13, జులై 16 తేదీల్లో బ్రేక్ దర్శనాలకు సంబంధించిన ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించ బోమని టీటీడీ స్పష్టం చేసింది. ఆణివార ఆస్థానం సందర్భంగా జులై 17వ తేదీన శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను సైతం రద్దు చేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

భక్తులు ఈ మార్పులను గమనించి, తమ తిరుమల యాత్రను తదనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ సూచించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande