నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
accident


చిట్యాల, 05 జూలై (హి.స.)

: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దక్క పార్టీ శివారులో హైదరాబాద్- విజయవాడ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. విజయవాడ నుంచీ హైదరాబాద్ వైపు వెళ్తున్న స్విఫ్ట్ కార్ ని అక్షయ ట్రావెల్ బస్సు అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీనితో కారు పక్కనే ఉన్న డివైడర్ ను బలంగా ఢీ కొట్టి పల్టీలు పడింది. కారులో డ్రైవర్ తో పాటు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రయాణిస్తుండగా డ్రైవర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. మిగతా నలుగురు కుటుంబ సభ్యులు కారులోనే తుది శ్వాస విడిచారు.

భార్యభర్తలతో పాటు ఒక కొడుకు, కూతురు మృతి చెందిన వారిలో ఉన్నారు. మృతుడు హైదరాబాద్ మధుర నగర్ లో నివాసం ఉంటున్న ప్రసాద్ గా తెలిసింది. ఇతను SBI బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. వీరి కుటుంబం చెన్నై నుంచీ హైదరాబాద్ కు కారులో వస్తుండగా తెల్లవారుజామున పెద్దకాపర్తి వద్ద మార్గమధ్యలో ప్రమాదం జరిగింది. వీరి స్వస్థలం కాకినాడ అని సమాచారం. డ్రైవర్ కూడా ప్రసాద్ ఫ్రెండ్ శ్రీకర్ ప్రసాద్ అని, కొంపల్లికి చెందిన వ్యక్తిగా తెలిసింది. ఇతను ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తాడని సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande