లారీని ఢీకొట్టి బోల్తాపడ్డ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. 10 మందికి గాయాలు..
లారీని ఢీకొట్టి బోల్తాపడ్డ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. 10 మందికి గాయాలు..
accident


హిందూపూర్ , 05 జూలై (హి.స.)గద్వాల జిల్లాలోని మానవపాడు స్టేజి దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీ ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు అయ్యాయి.

శనివారం రాత్రి హిందూపూర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు మానవపాడు స్టేజి దగ్గర జాతీయ రహదారిపై లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. ఆ వెంటనే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. పది మందికి గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande