
హైదరాబాద్, 05 జూలై (హి.స.)కాంగ్రెస్ సర్కార్ కంచెలు బద్దలుకొట్టుకుంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నారు. బీఆర్ఎస్ నాయకుల బృందంతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు.కేటీఆర్ గారి వెంట శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, మాలోత్ కవిత, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, బాల్క సుమన్, చల్లా ధర్మారెడ్డి, రసమయి బాలకిషన్, తాటికొండ రాజయ్య, జీవన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, కోరుకంటి చందర్, సుంకె రవిశంకర్, నోముల భగత్, చిరుముర్తి లింగయ్య, గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, వొడితల సతీష్ కుమార్, దాసరి మనోహర్ రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆరూరి రమేష్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు, వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించేందుకు బయల్దేరిన కేటీఆర్ బృందాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ అడుగడుగునా ప్రయత్నాలు చేసింది. పోలీసులను అడ్డంపెట్టుకుని, రహదారులను నిర్బంధిస్తూ కేటీఆర్ కాన్వాయ్‌ను ఆపే ప్రత్నం చేశారు. కానీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, బాల్క సుమన్, చల్లా ధర్మా రెడ్డి, రసమయి బాలకిషన్, జీవన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు బారికేడ్లను ఛేదించి ముందుకు తీసుకెళ్లారు..
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi