కొనసాగుతోన్న అల్పపీడనం.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
కొనసాగుతోన్న అల్పపీడనం.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
rain


కర్నూలు, 05 జూలై (హి.స.) వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలపై బాగా గుర్తించబడిన అల్పపీడనంగా కొనసాగుతోందని APSDMA తెలిపింది.

దీని ప్రభావంతో మేఘవృతమైన వాతావరణంతో పాటు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తరుణంలోనే ఆదివారం మేఘవృతమైన వాతావరణంతో పాటు ఒకటి-రెండుచోట్ల భారీ వర్షాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

APSDMA ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. అల్లూరి, పోలవరం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచనలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande