గిద్దలూరులో పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
గిద్దలూరులో పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
గిద్దలూరులో పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్


గిద్దలూరు, 05 జూలై (హి.స.) : ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా మార్కాపురం జిల్లా కలెక్టర్, ఈ రోజు ఆదివారం గిద్దలూరు అర్బన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు నెం. 192, 193, 195 మరియు 202లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని పరిశీలించారు. ఇంటింటి సర్వే, దరఖాస్తుల స్వీకరణ, ఓటరు జాబితా సవరణ, అర్హులైన ప్రతి ఓటరికి సేవలు అందుతున్న తీరును పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

అలాగే, బూత్ లెవల్ అధికారులు (BLOలు) తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి, అర్హులైన ఓటర్ల పేర్లు నమోదు చేయడం, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం స్వీకరించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా సమగ్రంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

ఓటరు జాబితా స్వచ్ఛత, ఖచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా SIR కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande