ఆధునిక స్క్రబ్ యూనిఫామ్ అమలు చేయాలి
ఆధునిక స్క్రబ్ యూనిఫామ్ అమలు చేయాలి
ఆధునిక స్క్రబ్ యూనిఫామ్ అమలు చేయాలి


హైదరాబాద్, 05 జూలై (హి.స.)

ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే నర్సులకు ఆధునిక స్క్రబ్‌ యూనిఫామ్‌ అమలు చేయాలని 97.7శాతం మంది నర్సులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ నర్సుల అసోసియేషన్‌(టీఎన్‌ఏ) ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించారు. ఈ ఆన్‌లైన్‌ సర్వేలో 2,637 మంది నర్సింగ్‌ ఆఫీసర్లు పాల్గొనగా.. 2,576 మంది ఆధునిక స్క్రబ్‌ యూనిఫామ్‌ అమలు చేయాలని అభిప్రాయపడ్డారు

అకడమిక్‌ డీఎంఈగా రమాదేవి

అకడమిక్‌ డీఎంఈగా ఎం రమాదేవి నియమితులయ్యారు. ఈ మేరకు హెల్త్‌ సెక్రటరీ డాక్టర్‌ క్రిస్టీనా జడ్‌ చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను ప్రభుత్వం అకడమిక్‌ డీఎంఈగా నియమించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande