
రేణిగుంట , 05 జూలై (హి.స.)ప్రముఖ సినీ హీరో నిఖిల్ రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం లభించింది.
హైదరాబాదు నుండి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న హీరో నిఖిల్ ను తిరుపతికి చెందిన ప్రముఖ యువ నాయకుడు రమణ యాదవ్ ( ఆర్ ఆర్) శాలువాతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం శరభయ్య యాదవ్ యువశక్తి సమావేశంలో పాల్గొనడానికి బైక్ ర్యాలీలో ర్యాలీ ద్వారా స్కంద క్రికెట్ నెట్ దగ్గరికి బయలుదేరి వెళ్లారు.ఈ కార్యక్రమంలో తిరుపతికి చెందిన యాదవ సంఘం నాయకులు, హీరో నిఖిల్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV