
అమరావతి, 06 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా నియమితులైన సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయశాఖ అధికారిక నోటిఫికేషన్ను జారీ చేసింది
ఈ నియామకాలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29 నుంచి 32కు పెరిగింది. హైకోర్టు ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన అదనపు న్యాయమూర్తులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ శుభాకాంక్షలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ