భారత. ఏఐ.రాజధానిగా ఆంధ్రప్రదేశ్ నీ తీర్చి దిద్దుతాం/మంత్రి నారా లోకేష్
భారత. ఏఐ.రాజధానిగా ఆంధ్రప్రదేశ్ నీ తీర్చి దిద్దుతాం/మంత్రి నారా లోకేష్
Lokesh


అమరావతి, 06 జూలై (హి.స.)

ఐదేళ్లలో 20 వేల స్టార్టప్లు, లక్ష ఉద్యోగాలే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్ప్రెన్యూర్’ లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఈరోజు(సోమవారం) దక్షిణ కొరియాలో సియోల్ బిజినెస్ ఏజెన్సీ (SBA) కొరియన్ స్టార్టప్ ఫౌండర్లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొని మాట్లాడారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లోకి కొరియన్ స్టార్టప్లకు ఆహ్వానం పలికారు. భారతదేశ ఏఐ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారు.

అమరావతి కేంద్రంగా ఆర్టీఐహెచ్.. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, అనంతపురంలో ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. ఇప్పటికే 2,500కు పైగా స్టార్టప్లకు ఆర్టీఐహెచ్ మద్దతు ఇచ్చిందని వివరించారు. 5,200 మందికి పైగా వ్యవస్థాపకులకు ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్యం కల్పించిందని వెల్లడించారు. స్టార్టప్లకు సీడ్ ఫండ్, డీప్ టెక్ గ్రాంట్లు, పెట్టుబడి సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. SIDBI భాగస్వామ్యంతో డీప్ టెక్ ఏంజెల్ ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande