
అమరావతి, 06 జూలై (హి.స.)
రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈ-ఏఈఈలకు 50:50 నిష్పత్తిలో పదోన్నతులు కేటాయించి నిష్పక్షపాతంగా అమలు చేయాలని ఏపీ పంచాయతీరాజ్ డిప్లొమో ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం విజయవాడ పీఆర్ ఈఎన్సీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం.. ఆ సంఘ అధ్యక్షుడు కె.రవీంద్ర అధ్యక్షతన నిర్వహించారు. శాఖలో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ద్వారా గానీ, నేరుగా గానీ నియామకం చేపట్టాలన్నారు. 2014-19లో చేపట్టిన ఉపాధి మెటీరియల్ సిమెంట్రోడ్లకు సంబంధించి గత ప్రభుత్వం ఆపాదించిన ఏసీబీ కేసులన్నింటినీ ఎత్తివేయాలని కోరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ