భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ చేసిన కలెక్టర్..
భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ చేసిన కలెక్టర్..
Collector


హైదరాబాద్, 06 జూలై (హి.స.) రాజీవ్ రహదారి స్టేట్ హైవే 01 ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించిన భూ నిర్వాసితులకు చెక్కులను అందచేయడం జరిగిందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా తెలిపారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏడుగురు భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కుల పంపిణీ కింద సుమారు రూ 4.5 కోట్ల రూపాయల విలువగల చెక్కులను కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. హైవే లో భూములు కోల్పోతున్న వారికి ఈ చెక్కులను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కదిరవన్ పలని, డిఆర్ఎ నారాయణ, ఎల్. ఏ .ఓ ఎస్ హెచ్-01 అపర్ణ, కార్యాలయ సిబ్బంది, భూనిర్వాసితులు, తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande