
బద్వేల్, 06 జూలై (హి.స.) : ఉద్యోగుల హక్కులు, ఆర్టీసీ పరిరక్షణ కోసం చేపట్టే జూలై 7, 8 నిరసన బ్యాడ్జీల కార్యక్రమాలను విజయవంతం చేయాలి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య ఈ రోజు ఏ.పీ.ఎస్.ఆర్టీసీ బద్వేలు డిపో ఆవరణలో డిపో కమిటీ సొంత నిధులతో నిర్మించుకున్న ఏపిపిటిడి (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వి.వెంకటేశ్వర్లు, జోనల్ కార్యదర్శి ఎన్.రాజశేఖర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, నాన్-ఆపరేషన్ యూనిట్ల నాయకులు, జిల్లాలోని అన్ని డిపోల యూనియన్ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య మాట్లాడుతూ, ఉద్యోగుల ఐక్యతతో నిర్మించిన యూనియన్ కార్యాలయం సంఘ బలానికి నిదర్శనమని బద్వేలు డిపో నాయకులను అభినందించారు.అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి నరసయ్య మాట్లాడుతూ, రేపు జూలై 7 మరియు 8 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న నిరసన బ్యాడ్జీల కార్యక్రమాలను ప్రతి డిపోలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రైవేటు భాగస్వామ్యంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడం సంస్థ మనుగడకే ప్రమాదమని అన్నారు. ప్రభుత్వ నిధులతోనే ఆర్టీసీ స్వంత విద్యుత్ బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ బస్సుల ఆపరేటర్ల కోసం మూసివేసిన నెల్లూరు-2, గుంటూరు-2, విద్యాధరపురం డిపోలను వెంటనే పునఃప్రారంభించాలని, అలాగే ఖాళీ చేయించే ప్రయత్నం జరుగుతున్న మంగళం డిపోను ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయరాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జేఏసీ 20 ప్రధాన డిమాండ్లపై ఆయన విపులంగా మాట్లాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV