
కదిరి , 06 జూలై (హి.స.) కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణలో భాగంగా, 25 సంవత్సరాల లోపు ఉన్న 20 మంది యాక్టివ్ రౌడీ షీటర్లు మరియు గంజాయి వినియోగదారులకు ఈరోజు ఉదయం ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా యువత తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనకుండా సత్ప్రవర్తనతో జీవించాలని సూచించడం జరిగింది.
భవిష్యత్తులో గంజాయి విక్రయం, వినియోగం, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు లేదా ఇతర నేరాలకు పాల్పడినట్లయితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించడం జరిగింది.
అలాగే ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయం, వినియోగం లేదా ఇతర నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కదిరి టౌన్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV