
దక్షిణ కొరియా , 06 జూలై (హి.స.) దక్షిణ కొరియాలో ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ రెండో రోజు పర్యటన అత్యంత బిజీగా సాగుతోంది. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ఆయన పలు కీలక భేటీలు నిర్వహించారు.
షూ’ కంపెనీతో భేటీ
సోమవారం ‘షూ ఆల్స్’ సంస్థ ఛైర్మన్ లీ చియాంగ్-గెన్తో సమావేశమైన మంత్రి లోకేశ్.. ఏపీలో షూ ఆల్స్ ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో కుదిరిన ఎంవోయూ ప్రకారం రాష్ట్రంలో పాదరక్షల యూనిట్ పనులను మరింత వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
జీగాబ్ హా, సాఫ్ట్-ఈపీఐ సీఈవోతో భేటీ తర్వాత షోలమ్ గ్రూప్ ఆఫీసర్ జీగాబ్ హా, సాఫ్ట్-ఈపీఐ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్లతో ఆయన భేటీ అయ్యారు. శ్రీసిటీలో యూనిట్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. రూ.338 కోట్లతో షోలమ్ సంస్థ ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్ నిర్మించాలని వెల్లడించారు. ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. తిరుపతి ఐఐటీ సహకారంతో ఈపీఐ అకాడమీని ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని కొరియా ప్రతినిధులు తెలిపినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV