
శ్రీశైలం, 06 జూలై (హి.స.) జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
అష్టాదశ శక్తిపీఠం,ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం కి భక్తులు పోటెత్తారు క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలి వచ్చిన భక్తులు క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు .
శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది మరోపక్క భక్తులు రద్దీ దృష్ట్యా సోమవారం ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేసిన అధికారులు,సామాన్య భక్తులకు ఉచిత,శీఘ్ర,అతిశీఘ్ర,దర్శనానికి క్యూలైన్ల ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు,ఆన్లైన్లో విఐపి బ్రేక్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు రెండు విడతలుగా ఉదయం 7:30 కు రాత్రి 9 గంటలకు మాత్రమే(BREAK) స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్న అధికారులు, దర్శనార్థమై క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం,బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV