
శ్రీకాళహస్తి, 06 జూలై (హి.స.): జాతీయ సమైక్యతకు అంకితభావంతో దేశ సమగ్రత కోసం నిరంతరం కృషి చేసిన జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని 74వ బూత్ పరిధిలో కోలా ఆనంద్ స్వగృహ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 22 మంది కార్యకర్తలతో కలిసి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశ సమైక్యత, జాతీయత, ప్రజాసేవకు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ కో-కన్వీనర్ ఎం. సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు గోవర్ధన్, కిరణ్, మహేష్, సాయి, చిన్న తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV