కామన్వెల్త్ గేమ్స్ 2026: జావలిన్లో నీరజ్ చోప్రాకు రజతం, జుడోలో అస్మితా దేయ్ చారిత్రాత్మక స్వర్ణ పతకం సాధన
కామన్వెల్త్ గేమ్స్ 2026: జావలిన్లో నీరజ్ చోప్రాకు రజతం, జుడోలో అస్మితా దేయ్ చారిత్రాత్మక స్వర్ణ పతకం సాధన
comon


హైదరాబాద్, 01 ఆగస్టు (హి.స.)

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. పురుషుల జావలిన్ త్రో ఫైనల్ పోటీల్లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రజత పతకం (సిల్వర్) కైవసం చేసుకోగా, ఇదే ఈవెంట్‌లో భారత్‌కు చెందిన యశ్‌వీర్ సింగ్ కాంస్య పతకాన్ని (బ్రాంజ్) సాధించి డబుల్ ధమాకా అందించారు. మరోవైపు జుడో విభాగంలో భారత్‌కు ఊహించని చారిత్రాత్మక విజయం దక్కింది. ఒక సామాన్య మెకానిక్ కుమార్తె అయిన అస్మితా దేయ్, తన అసాధారణ ప్రతిభతో ప్రత్యర్థులను చిత్తు చేసి జుడోలో దేశానికి మొట్టమొదటి బంగారు పతకాన్ని (గోల్డ్) అందించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ అద్భుత విజయాలతో పతకాల పట్టికలో భారత స్థానం మరింత మెరుగైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande