
ఢిల్లీ, 01 ఆగస్టు (హి.స.) గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్ దక్కింది. తాజాగా కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు... క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆగస్టు ఒకటవ వచ్చిన నేపథ్యంలో ఇవాళ కూడా కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక తాజా సవరణతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరపై రూ.202 తగ్గించారు. కోల్ కతాలో రూ. 209 తగ్గింది. ఈ క్రమంలో కోల్కతాలో వాణిజ్య సిలిండర్ ధర నేటి నుంచి రూ. 2,872.50గా ఉంటుంది. అయితే గృహ వినియోగదారులు ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. కొత్త ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV