అయోధ్య విరాళాల చోరీ కేసు: చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు 'సిట్' క్లీన్ చిట్
అయోధ్య విరాళాల చోరీ కేసు: చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు 'సిట్' క్లీన్ చిట్
Ayodhya


న్యూఢిల్లీ, 18 ఆగస్టు (హి.స.)

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాల చోరీ, నిధుల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఆరోపణల కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాలకు SIT క్లీన్చిట్ ఇచ్చింది. విరాళాల వ్యవహారంలో వీరిద్దరి ప్రమేయం ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని సిట్ తన దర్యాప్తు నివేదికలో స్పష్టం చేసింది. గతంలో విరాళాల నిధుల నిర్వహణపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కేసును సమగ్ర దర్యాప్తు కోసం సిట్కు అప్పగించిన సంగతి తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే దర్యాప్తు అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చోరీకి గురైన నిధులు, బ్యాంక్ లావాదేవీలకు ట్రస్ట్ ఉన్నతాధికారులకు ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధం లేదని సిట్ అధికారులు తేల్చారు. ఈ క్లీన్చిట్తో ట్రస్ట్ ప్రతినిధులపై వచ్చిన నిరాధార ఆరోపణలకు తెరపడినట్లయింది. ఈ కేసులో అసలు నిందితులపై చట్టపరమైన తదుపరి చర్యలను కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande