జాతీయ క్రీడా పురస్కారాలు-2025 ప్రకటన.. 17 మందికి అర్జున అవార్డులు
జాతీయ క్రీడా పురస్కారాలు-2025 ప్రకటన.. 17 మందికి అర్జున అవార్డులు
Sports awards


హైదరాబాద్, 18 ఆగస్టు (హి.స.)

ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా

పురస్కారాలు(National Sports Awards-2025)ను కేంద్ర యువజన వ్యవహారాలు , క్రీడల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం వివిధ విభాగాల్లో అవార్డులను ఖరారు చేసింది. దేశంలోని వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 17 మంది అథ్లెట్లను ప్రతిష్టాత్మక 'అర్జున అవార్డు'కు ఎంపిక చేశారు. ప్రపంచ కప్ విజేత, యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ ముఖ్, స్టార్ షట్లర్ పుల్లెల గాయత్రి గోపీచంద్, ఆమె డబుల్స్ భాగస్వామి త్రీసా జాలీ, చెస్ గ్రాండ్మాస్టర్ విదిత్ గుజరాతి, డెకాథ్లెట్ తేజస్విన్ శంకర్, డెఫ్ రైఫిల్ షూటర్ ధనుష్ శ్రీకాంత్, గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల బాక్సింగ్ రజత పతక విజేత నరేందర్ తదితరులు ఈ జాబితాలో ప్రముఖులుగా నిలిచారు.

అయితే, దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారమైన 'మేజర్ ధ్యానంద్ ఖేల్ రత్న' అవార్డును ఈ ఏడాది ఏ క్రీడాకారుడికీ ప్రకటించకపోవడం గమనార్హం. మరోవైపు, 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన మాజీ ఫుట్బాలర్ ఐ. అరుణ్మయ్నైయగమ్ను క్రీడారంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 'లైఫ్ టైమ్ అచీవ్మెంట్' అర్జున పురస్కారానికి ఎంపిక చేశారు. ద్రోణాచార్య రెగ్యులర్ విభాగంలో ముగ్గురు కోచ్లకు, లైఫ్ఎమ్ విభాగంలో ఇద్దరికి అవార్డులు దక్కగా, 'రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్'ను పూణేకు చెందిన ఆర్మీ పారాలింపిక్ నోడ్ కైవసం చేసుకుంది. గడిచిన నాలుగేళ్ల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో క్రమశిక్షణతో కూడిన నిలకడైన ప్రతిభ ప్రదర్శించిన వారికే ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు కేంద్ర క్రీడా శాఖ స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande