ఉరిశిక్షకు ప్రత్యామ్నాయ పద్ధతులపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఉరిశిక్షకు ప్రత్యామ్నాయ పద్ధతులపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు
Supreme court


న్యూఢిల్లీ, 18 ఆగస్టు (హి.స.)

మరణ శిక్ష (death sentence) పడ్డ ఖైదీలను ఉరి తీసే ప్రక్రియ అత్యంత బాధాకరంగా, అమానవీయంగా ఉంటోందని.. అందుకు ప్రత్యామ్నాయంగా మరింత గౌరవప్రదమైన, తక్కువ వేదన కలిగించే పద్ధతిని అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. ఉరిశిక్ష అమలు విధానంపై దాఖలైన ఈ వ్యాజ్యాలపై వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం గతంలోనే తన తీర్పును రిజర్వ్ చేసింది.

అయితే, ప్రస్తుత ఉరిశిక్ష అమలు విధానాన్ని సమగ్రంగా సమీక్షించి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మరణశిక్ష అమలుకు ఏదైనా ప్రత్యామ్నాయ పద్ధతిని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం (Central Govt) భావిస్తే తమ తీర్పు అడ్డంకి కాబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వానికి ఈ అంశంపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పుతో ప్రస్తుతానికి చట్టబద్ధమైన ఉరిశిక్ష అమలు విధానంలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని తేటతెల్లమైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande