పికప్ వ్యాన్ను ఢీకొన్న డంపర్.. ఎనిమిది మంది కూలీలు మృతి
పికప్ వ్యాన్ను ఢీకొన్న డంపర్.. ఎనిమిది మంది కూలీలు మృతి
పికప్ వ్యాన్ను ఢీకొన్న డంపర్.. ఎనిమిది మంది కూలీలు మృతి


భిండ్, 18 ఆగస్టు (హి.స.) పికప్ వ్యాన్ను డంపర్ వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో భారీప్రమాదం (major accident) చోటు చేసుకొని 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లా పరిధిలో గల భిండ్-గ్వాలియర్ జాతీయ రహదారి (NH-719) పై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఛీమ్కా గ్రామం సమీపంలో వరి నాట్లు వేసే పనులు ముగించుకుని తిరిగి వెళ్తున్న కూలీలతో వెళ్తున్న పికప్ వ్యాన్ (Pickup van)ను ఎదురుగా వేగంగా వచ్చిన డంపర్ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. అర్ధరాత్రి సమయంలో రహదారిపై ఉన్న మూగజీవాల గుంపును తప్పించబోయే క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో ఉత్తరప్రదేశ్కు చెందిన 8 మంది వ్యవసాయ కూలీలు (Agricultural laborers) అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న గోహద్ చౌరహా పోలీసులు, స్థానిక గ్రామస్తులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు (Assistive measures) చేపట్టారు. క్షతగాత్రులను రక్షించి ప్రాథమిక చికిత్స నిమిత్తం గోహద్ ఆసుపత్రికి (Gohad Hospital), పరిస్థితి విషమంగా ఉన్న పలువురిని మెరుగైన వైద్యం కోసం గ్వాలియర్ ఆసుపత్రికి (Gwalior Hospital) తరలించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. హైవేపై ట్రాఫిక్ను పునరుద్ధరించి కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఒకేసారి ఎనిమిది మంది శ్రామికులు ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande