సగ్గుబియ్యంతో ఎన్ని సమస్యలు దూరమవుతాయో తెలుసా, తెలిస్తే రోజూ తింటారు
ఈ బియ్యంలో ఉండే విటమిన్ కె మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్ సమస్యలకు ఇది రారాజులగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు
Eating just a bowl of this mixture made with finger millet ragi an


బెంగళూరు, 02 ఆగస్టు (హి.స.)సగ్గు బియ్యం.. వీటితో ఎన్నో రకాల వంటకాలు చేస్తారు. హ్యాపీగా తింటూనే ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. మరి వీటిని ఎలా తయారుచేస్తారు. వాటితో కలిగే లాభాలేంటో తెలుసుకోండి.

సగ్గుబియ్యాన్ని కర్రపెండలం నుంచి తయారు చేస్తారు. ఈ సగ్గబియ్యంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్ సి, కాల్షియం, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ సగ్గుబియ్యంలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బితో పాటు ఐరన్ కాల్షియం, విటమిన్ కెలు కూడా ఉన్నాయి. వీటిని తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి.

ఇక సగ్గుబియ్యం తయారీ విషయానికొస్తే కర్రపెండలం పైతొక్కని తీసి క్లీన్ చేసి చెరకు రసం తీసినట్టు పెండలం నుంచి తీస్తే పాల పదార్థం వస్తుంది. దానిని చిక్కగా చేస్తారు. ఈ పిండిని రకరాల పరిమాణంలో రంధ్రాలున్న జల్లెడ లాంటి పాత్రలో వేసి కదుపుతారు. దీంతో తెల్లని పూసల్లా సగ్గు బియ్యం తయారవుతాయి. వీటిని తయారుచేసినప్పుడు మెత్తగా ఉంటాయి. పెద్ద పెనం మీద వేడి చేసి తర్వాత ఎండలో ఆరబెడతారు. ఇలా తయారైన సగ్గుబియ్యాన్ని మనం ఎన్నో రకాలుగా మన డైట్లో చేర్చి వాటి రుచిని ఆస్వాదిస్తూ ఆరోగ్య ప్రయోజనాలని పొందుతాం. అవేంటో తెలుసుకోండి.

ఈ బియ్యంలో ఉండే విటమిన్ కె మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్ సమస్యలకు ఇది రారాజులగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

రాగులు, సగ్గు బియ్యం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండు కూడా తిన్న వెంటనే జీర్ణమవుతుంది. ఇంకా వీటిని అనేక వంటకాలలో కూడా వాడుతారు. సగ్గు బియ్యాన్ని తాటి చెట్టు నుంచి తీసిన రసాన్ని పిండిలాగా చేసి వాటి నుంచి తయారు చేస్తారు. ఇది ఈజీగా జీర్ణమవుతుంది. ఇంకా ఈ రెండు గిన్నెడు తింటే కీళ్లలో గుజ్జు పెరిగి, నొప్పులు తగ్గిపోతాయి.

సగ్గు బియ్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాడీలో అధిక వేడి ఉన్నవారు వీటిని జావగా తీసుకుంటే

శరీరంలో వేడి వెంటనే తగ్గిపోతోంది. ఇంకా జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇవి సూపర్ ఫుడ్. ఇంకా దీనిలో ఎలాంటి రసాయనాలు ఉండవు అందుకే దీనిని నేచురల్ స్వీటనర్గా చెబుతుంటారు.

రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఎందుకంటే, దీనిలో మనకి కావల్సిన కాల్షియం, ఐరన్, ఫైబర్ పెద్ద మొత్తంలో ఉంటాయి. అందువలన వీటిని తాతల కాలం నుంచి తింటున్నారు. అంతక ముందు వీటితో చేసిన ఆహారాలను తినే వాళ్లు. మీరు ఎగ్స్ తినేకన్నా ఉదయం రాగులతో దోస తిన్నా అంతే సమానమైన శక్తి వస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande