
ముంబై: , 02 ఆగస్టు (హి.స.)
మహారాష్ట్రలోని ముంబై నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న తీరప్రాంత జిల్లాల్లో గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వాతావరణ పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశం ఉండటంతో భారత వాతావరణ శాఖ ఆదివారం ఉదయం సదరు జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన ఎరుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. రాబోయే ఇరవై నాలుగు గంటల్లో తీరప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు విపత్తు నిర్వహణ బలగాలు రంగంలోకి దిగాయి. ముంబై నగరంలోని పలు ప్రధాన రహదారులు మరియు రైల్వే పటాలపైకి నీరు చేరడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi