ఝార్ఖండ్ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు ఉద్యోగులు మృతి
ఝార్ఖండ్ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు ఉద్యోగులు మృతి
Fire accident


జార్ఖండ్, 22 ఆగస్టు (హి.స.)

గత అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద సంఘట జార్ఖండ్ రాష్ట్రం రామ్గఢ్ జిల్లాలోని రామ్గఢ్ పరిధిలోని హేలాల్ గ్రామంలో ఉన్న ఓ స్టీల్ ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. క్యాప్టివ్ పవర్ ప్లాంట్లో శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగి పరిశ్రమ అంతటా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో ఉన్న నలుగురు సిబ్బంది మంటల్లో చిక్కుకుని తీవ్ర కాలిన గాయాలకు గురయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించాయి. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు ఉద్యోగులు మృతి చెందారని, గాయపడిన మరొకరికి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారని రామ్ గఢ్ ఎస్పీ ముఖేష్ కుమార్ లునాయత్ వెల్లడించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు, సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande