ఛత్తీస్గఢ్లో ఎండోస్కోపీ కెమెరాతో పరీక్ష పత్రాల దొంగతనం.. అగ్రికల్చర్ పేపర్ లీక్ కేసులో ప్రొఫెసర్ అరెస్ట్

రాయ్‌పూర్, 23 ఆగస్టు (హి.స.)

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ పరిధిలో జరిగిన అగ్రికల్చర్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ పరీక్ష పత్రాల దొంగతనం వ్యవహారంలో పోలీసులు ఒక ప్రొఫెసర్‌తో సహా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సదరు ప్రొఫెసర్ పేపర్ లీక్ చేయడానికి అనుసరించిన విధానం చూసి దర్యాప్తు అధికారులే షాక్‌కు గురయ్యారు. స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన క్వశ్చన్ పేపర్లను తాకకుండా, సీల్ ఓపెన్ చేయకుండా ఉండేందుకు నిందితుడు అత్యంత అధునాతనమైన మెడికల్ ఎండోస్కోపీ కెమెరాను ఉపయోగించాడు. తలుపుల సందుల గుండా ఈ కెమెరా వైరును లోపలికి పంపి, ప్రశ్నపత్రాల ఫోటోలను చాలా స్పష్టంగా క్యాప్చర్ చేశాడు. ఆ తర్వాత ఆ ఫోటోలను కొందరు విద్యార్థులకు భారీ మొత్తానికి విక్రయించినట్లు విచారణలో తేలింది. పరీక్ష కేంద్రాల్లోని భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని ఈ హైటెక్ దొంగతనానికి పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులు నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, ఎండోస్కోపీ పరికరాలు మరియు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని లోతైన విచారణ జరుపుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande