ఢిల్లీలో కుండపోత వాన .. పలు విమాన సర్వీసులకు అంతరాయం..!
ఢిల్లీలో కుండపోత వాన.. పలు విమాన సర్వీసులకు అంతరాయం..!
Rain


న్యూఢిల్లీ, 24 ఆగస్టు (హి.స.)

ఉత్తర భారతంలో వానలు జోరందుకున్నాయి. రుతుపవనాల కారణంగా దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు రోడ్లన్ని జలమయమవ్వగా.. ప్రతికూల పరిస్థితుల కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. నగరంలో జనజీవనం స్తంభించిపోగా.. గురుగ్రామ్, ఫరిదాబాద్లకు భారత వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

ఢిల్లీలో సోమవారం ఉదయం నుంచే వాన దంచుతోంది. రాజధాని సమీపంలోని ఎన్సీఆర్ ప్రాంతం, నోయిడా, గజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్లోనూ వర్షం భారీగా పడుతోంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

ఇప్పటివరకూ దాదాపు 12 విమానాలను జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. ఢిల్లీ నుంచి 6E 404, IX 1462, IX 1047, AI 4308, ΑΙ 2526, IX 1236, IX 136, SG 126, AI 1814, 6E 6125, 6E 2102 and Al 2381 ఫ్లైట్స్ను జైపూర్ కు దారి మళ్లించినట్టు ఢిల్లీ విమానయానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే వానలు దంచుతుండగా.. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో మరింతగా భారీ వర్షం పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, ఒడిశా, తెలంగాణలో కూడా పెద్ద వానలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande