ఆపరేషన్ సిందూర్ సైబర్ ఉగ్రవాదం కేసులో NIA దేశవ్యాప్త దాడులు
ఆపరేషన్ సిందూర్ సైబర్ ఉగ్రవాదం కేసులో NIA దేశవ్యాప్త దాడులు
NIA arrest


న్యూఢిల్లీ, 25 ఆగస్టు (హి.స.)

దేశ సార్వభౌమత్వానికి, రక్షణ వ్యవస్థకు విఘాతం కలిగించేలా ప్రభుత్వ వెబ్‌సైట్‌లపై జరిగిన సైబర్ దాడుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నిన్న అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించింది. 'ఆపరేషన్ సిందూర్' సైనిక చర్యల సమయంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన దాదాపు 54 కీలక వెబ్‌సైట్‌లపై 'DDoS' (Distributed Denial of Service) పద్ధతిలో అధునాతన సైబర్ దాడులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. గత ఏడాది కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సమయంలో ఈ హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగాయి. ఈ కేసులో భాగంగా తెలంగాణలోని రామగుండం, మహారాష్ట్రలోని జున్నార్, గుజరాత్‌లోని నడియాడ్, బిహార్‌లోని గోపాల్‌గంజ్‌తో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. అనుమానితుల ఇళ్ల నుండి ల్యాప్‌టాప్‌లు, ఐదు మొబైల్ ఫోన్లు, హ్యాకింగ్ డేటా కలిగిన పెన్ డ్రైవ్‌లను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకుని విచారణను వేగవంతం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande