ప్రభుత్వ పాఠశాలలో వికటించిన మధ్యాహ్న భోజనం - 27 మంది విద్యార్థులకు అస్వస్థత
ప్రభుత్వ పాఠశాలలో వికటించిన మధ్యాహ్న భోజనం - 27 మంది విద్యార్థులకు అస్వస్థత
ప్రభుత్వ పాఠశాలలో వికటించిన మధ్యాహ్న భోజనం - 27 మంది విద్యార్థులకు అస్వస్థత


కోటా జిల్లా (రాజస్థాన}, 25 ఆగస్టు (హి.స)

-

రాజస్థాన్‌లోని కోటా పరిధిలో ఉన్న పూనియా దేవ్లీ ప్రభుత్వ పాఠశాలలో నిన్న మధ్యాహ్నం అందించిన మధ్యాహ్న భోజనం (Mid-Day Meal) వికటించి తీవ్ర కలకలం రేగింది. పాఠశాలలో ఒకటి నుండి ఎనిమిదో తరగతి చదువుతున్న 27 మంది విద్యార్థులు ఆహారం తిన్న కొద్దిసేపటికే కడుపునొప్పి, వాంతులు, తలతిరగడం వంటి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలతో స్పృహతప్పారు. పాఠశాల సిబ్బంది తక్షణమే స్పందించి తీవ్రంగా ప్రభావితమైన 21 మంది పిల్లలను కోటాలోని ప్రభుత్వ న్యూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందించడంతో ప్రస్తుతం పిల్లలందరి ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై రాజస్థాన్ విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది. ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపడమే కాకుండా, నిర్లక్ష్యానికి కారణమైన వంట ఏజెన్సీపై మరియు పర్యవేక్షణ లోపంపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande