స్థానిక వివాదంతో తీవ్ర ఉద్రిక్తత, పోలీసులపై రాళ్లదాడి
స్థానిక వివాదంతో తీవ్ర ఉద్రిక్తత, పోలీసులపై రాళ్లదాడి
స్థానిక వివాదంతో తీవ్ర ఉద్రిక్తత, పోలీసులపై రాళ్లదాడి


ఉత్తరప్రదేశ్ (బుదౌన్): , 26 ఆగస్టు (హి.స.)

ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లా సిక్రి గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయమై చెలరేగిన వివాదం తీవ్ర శాంతిభద్రతల సమస్యగా మారింది. గ్రామంలోని ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న భూమిలో అనుమతి లేకుండ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఒక వర్గం ప్రయత్నించగా, మరో వర్గం దానికి తీవ్ర అభ్యంతరం తెలిపింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, గ్రామస్తుల మధ్య వాగ్వాదం తీవ్రమై కోపోద్రిక్తులైన కొందరు గుంపుగా చేరి పోలీసు సిబ్బందిపైకి రాళ్లు రువ్వడం ప్రారంభించారు.

అనుకోకుండా జరిగిన ఈ రాళ్లదాడిలో ఏడుగురు పోలీసు సిబ్బందితో పాటు ఒక స్థానిక పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటడంతో ఆందోళనకారులు కొన్ని పోలీసు వాహనాలు మరియు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేయడానికి జిల్లా ఎస్పీ అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించి లాఠీచార్జ్ మరియు భాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భారీగా పోలీసులను మోహరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసులపై దాడులకు పాల్పడిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, రికార్డైన వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande