సీమాంతర సరిహద్దుల పరిష్కారానికి భారత్-చైనా కీలక నిర్ణయం
సీమాంతర సరిహద్దుల పరిష్కారానికి భారత్-చైనా కీలక నిర్ణయం
సీమాంతర సరిహద్దుల పరిష్కారానికి భారత్-చైనా కీలక నిర్ణయం


న్యూఢిల్లీ, 27 ఆగస్టు (హి.స.)

భారత్ మరియు చైనా దేశాల మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సరిహద్దు వివాదాల పరిష్కారం దిశగా మరో కీలక ముందడుగు పడింది. భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ మరియు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో సరిహద్దుల డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ప్రాథమిక ఒప్పందానికి వచ్చారు. ఉమ్మడి సరిహద్దుల్లో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు, గతంలో నిలిచిపోయిన సరిహద్దు చర్చలను పునరుద్ధరించాలని ఇరుదేశాల ప్రతినిధులు నిర్ణయించారు. వాస్తవాధీన రేఖ (LAC) వద్ద ఉద్రిక్తతలను తగ్గించి, వ్యూహాత్మక స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి ఈ చర్చలు దోహదపడతాయని విదేశాంగ శాఖ తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande