
ముంబై, మహారాష్ట్ర, 27 ఆగస్టు (హి.స.)
మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) సంచలన నిర్ణయం తీసుకుంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్షలో పేపర్ లీకేజీ జరిగినట్లు ఆధారాలు లభించడంతో మొత్తం నియామక ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే 488 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ రౌండ్‌ను సైతం పూర్తి చేసుకున్నప్పటికీ, పరీక్ష పారదర్శకతను కాపాడేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ వెల్లడించింది. ఈ లీకేజీ ఉదంతంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi