
న్యూఢిల్లీ, 27 ఆగస్టు (హి.స.)
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 44వ ‘ప్రగతి’ (PRAGATI) సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ వివిధ అభివృద్ధి పథకాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల తీవ్రతపై ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సైబర్ ఫ్రాడ్‌లను అరికట్టడానికి అత్యాధునిక ఏఐ (Artificial Intelligence) మరియు సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. డిజిటల్ అరెస్టులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాల బారిన పడకుండా ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలని, అలాగే వివిధ ప్రభుత్వ శాఖలు మరియు బ్యాంకింగ్ రంగాలు సమన్వయంతో సైబర్ ముప్పును తిప్పికొట్టాలని ప్రధాని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi