
న్యూఢిల్లీ, 28 ఆగస్టు (హి.స.)
రాఖీ పండుగ నేపథ్యంలో ఇవాళ స్కూల్ పిల్లలతో ప్రధాని మోదీ(PM Modi) కాసేపు సరదాగా గడిపారు. ఢిల్లీలోని ఆయన అధికార నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్ ఆ సంబరాలు జరిగాయి.
చిన్నతనంలో మీరెటువంటి కల కన్నారని పిల్లలు ప్రధాని మోదీని అడిగారు. ఆ ప్రశ్నకు మోదీ సరదాగా సమాధానం ఇచ్చారు. మీ అందరితో కలువాలని ఆయన నవ్వుతూ జవాబు ఇచ్చారు. చిన్నారులతో మాట్లాడుతున్న వీడియోను రిలీజ్ చేశారు. మోదీ వారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. హై5 చేతులతో కుర్రాళ్ల తరహాలో విషెస్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో మోదీ ఆ రీల్ను షేర్ చేశారు. చిన్నారులను ఆయన దీవించారు. రక్షాబంధన్ గ్రీటింగ్స్ కూడా ఆయన తెలిపారు. ప్రేమ, ఆప్యాయత, నమ్మకం గురించి ఆయన చెప్పారు. రాఖీ పండుగ మీ జీవితాల్లో సంతోసాన్ని, సౌభాగ్యాన్ని, విజయాన్ని అందించాలని కోరుతున్నట్లు మోదీ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..