ప్రస్తుతం భారతదేశ విదేశీ మారక నిల్వలు అత్యంత బలంగా ఉన్నాయి.. ఆర్.బి.ఐ మాజీ గవర్నర్
ప్రస్తుతం భారతదేశ విదేశీ మారక నిల్వలు అత్యంత బలంగా ఉన్నాయి.. ఆర్.బి.ఐ మాజీ గవర్నర్
RBI


హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)

డాలర్తో పోలిస్తే రూపాయి విలువ

పతనంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (Raghuram Rajan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాలో మాట్లాడుతూ.. ప్రస్తుతం రూపాయి విలువలో కనిపిస్తున్న క్షీణతతో ఆందోళ చెందాల్సిన పరిస్థితి ఎంతమాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, విదేశీ పెట్టుబడుల ప్రవాహంలో మార్పులు, గ్లోబల్ మార్కెట్ ప్రతికూలతల వల్లే రూపాయిపై తాత్కాలిక ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశ విదేశీ మారక నిల్వలు అత్యంత బలంగా ఉన్నాయని, రూపాయిలో తీవ్రమైన హెచ్చుతగ్గులు రాకుండా అదుపు చేసే సామర్థ్యం ఆర్బీఐకి ఉందని స్పష్టం చేశారు. స్వల్పకాలిక హెచ్చుతగ్గులను చూసి భయపడాల్సిన అవసరం లేదని, భారత ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలు స్థిరంగానే ఉన్నాయని రఘురామ్ రాజన్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande