
న్యూఢిల్లీ, 28 ఆగస్టు (హి.స.)
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ
అధ్యక్షురాలు సోనియాగాంధీ
(Sonia Gandhi) రాసినట్లు ప్రచారంలో ఉన్న 'బిలాంగింగ్ ఇన్ ఇండియా'పుస్తకం పై ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా (Penguin Random House India) కీలక ప్రకటన చేసింది. ఆ పుస్తకాన్ని తాము ప్రచురించడం లేదని సదరు సంస్థ అధికారికంగా వెల్లడించింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికలతో పాటు వివిధ మీడియా వర్గాల్లో సోనియా గాంధీ ఒక కొత్త పుస్తకాన్ని తీసుకువస్తున్నారని, దానిని పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురిస్తోందంటూ వార్తలు విస్తృతంగా చక్కర్లు కొట్టాయి. 'బిలాంగింగ్ ఇన్ ఇండియా' పేరుతో రానున్న ఈ పుస్తకంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ ప్రచారంపై స్పందించిన పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేస్తూ, 'తాము బిలాంగింగ్ ఇన్ ఇండియా పుస్తకానికి ప్రచురణకర్తలం కాము' అని స్పష్టంగా తేల్చిచెప్పింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..