
న్యూఢిల్లీ, 28 ఆగస్టు (హి.స.)
భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నారనే ఆరోపణలతో మహమ్మద్ సాహిల్, ఆయన భార్య సమీరాలను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. 2024 నుంచి సోషల్ మీడియా ద్వారా పాక్ హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతూ వీరు గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2024లో సాహిల్కు ఇన్స్టాగ్రామ్ ద్వారా పాకిస్తాన్కు చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే క్రమంగా దేశ వ్యతిరేక గూఢచర్య కార్యకలాపాలకు దారితీసింది. సాహిల్తో పాటు అతని భార్య సమీరా కూడా పాక్ హ్యాండ్లర్లతో నిరంతరం టచ్ ఉంటూ భారత రక్షణ విభాగాలకు సంబంధించి, అలాగే స్థానీకంగా ఉన్న సున్నితమైన సమాచారాన్ని అందిస్తూ వారికి సహకరించినట్లు తేలింది.
2024 నుంచి 2025 మధ్యకాలంలో ఈ దంపతులు ఎనిమిది భారతీయ సిమ్ కార్డులను సేకరించి, వాటిని దుబాయ్ మీదుగా పాకిస్తాన్కు తమ హ్యాండ్లర్లకు పంపారు. ఆ సిమ్ కార్డుల ద్వారా పాక్ ఏజెంట్లు భారతదేశంలో వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేసి, స్థానిక గ్రూపుల్లో చేరుతూ సమాచారం సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటిలో ఉన్న డిజిటల్ ఆధారాలు, చాటింగ్లు, సంభాషణలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. ఈ నెట్వర్క్ ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి? ఆర్థిక లావాదేవీలు ఏ మార్గాలో జరిగాయి? భారత్లో వీరికి ఇంకా ఎవరైనా సహకరించారా? అనే కోణాల్లో స్పెషల్ సేల్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..