
శ్రీశైలం, 28 ఆగస్టు (హి.స.)
శ్రీశైలం శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవార్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జే.బి.పార్దివాలా దంపతులు దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న జే.బి.పార్దివాలా దంపతులకు ఆలయ మర్యాదలనుసరించి ఆలయ అర్చకులు,ఆలయ ఈవో శ్రీనివాసరావు సాదర స్వాగతం పలికారు.
అనంతరం శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకుని మల్లికార్జునస్వామికి రుద్రాభిషేకం,అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు దర్శనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జే.బి.పార్దివాలా దంపతులకు అర్చకులు,వేదపండితులు వేద ఆశీర్వచనం చెయ్యగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీస్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు, చిత్రపటాన్ని శ్రీశైలం చరిత్రకు సంబంధించిన శ్రీశైలం ఖండ పుస్తకాన్ని న్యాయమూర్తి దంపతులకు అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV