
అన్నమయ్య జిల్లా, 28 ఆగస్టు (హి.స.)అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం మల్లూరులో తిరుమల-తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, హరితమ్మ దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు తీసుకొచ్చి సమర్పించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారి కల్యాణం సంప్రదాయబద్ధంగా సాగింది.
భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా చూసి తిలకించారు. భక్తుల గోవింద నామస్మరణతో కళ్యాణ ప్రాంగణం మారుమోగింది. టిటిడి తరపున కంకణాలు, ప్రసాదం ను అందజేశారు. భక్తులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నదానం ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV