
వేపగుంట: , 29 ఆగస్టు (హి.స.)
విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్తవలసకు చెందిన మల్ల ప్రవీణ్ కుమార్ కొంతకాలంగా జీవనోపాధి కోసం పెందుర్తిలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ప్రవీణ్ ఆటో డ్రైవర్గా, అతని భార్య కాయగూరల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు రెండేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాఖీ పండుగ సందర్భంగా నిన్న కుటుంబ సభ్యులతో రాఖీలు కట్టించుకున్న ప్రవీణ్ కుమార్.. రాత్రి సమయంలో సెల్ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు ‘RIP’ అంటూ సందేశం పంపినట్లు సమాచారం.
ఆ తర్వాత ప్రవీణ్ కుమార్ ఉరివేసుకుని, అతని భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు విషపదార్థం తిని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తల్లి, ఇద్దరు బిడ్డలను వెంటనే ఆస్పత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపార. రాఖీ పండుగ రోజున కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన అనంతరం చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలా.. ఆర్థిక ఇబ్బందులు కారణమా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ