ఎల్ఓసీ వద్ద 3 పాకిస్తానీ డ్రోన్ల చొరబాటు: తిప్పికొట్టిన భారత ఆర్మీ
ఎల్ఓసీ వద్ద 3 పాకిస్తానీ డ్రోన్ల చొరబాటు: తిప్పికొట్టిన భారత ఆర్మీ
Pakistan imposes curfew in Balochistan's Sorab district


జమ్మూ కాశ్మీర్‌, 29 ఆగస్టు (హి.స.)

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ, పూంచ్ జిల్లాల సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ (LoC) వద్ద భారత సైన్యం పాకిస్తానీ డ్రోన్ల చొరబాటు కుట్రను సమర్థవంతంగా తిప్పికొట్టింది. శత్రు దేశం నుంచి వచ్చిన మూడు డ్రోన్లు భారత వైమానిక పరిధిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, సరిహద్దుల్లోని జవాన్లు తక్షణమే స్పందించి ఆ ప్రయత్నాలను భగ్నం చేశారు.

రాజౌరీ జిల్లాలోని నౌషేరా, పూంచ్ జిల్లా మెంధార్ సెక్టార్ పరిధిలోని బాలాకోట్ ప్రాంతానికి చెందిన బెహ్రూటీ గ్రామం వద్ద శుక్రవారం రాత్రి ఈ పాకిస్తానీ డ్రోన్ల కదలికలను భద్రతా బలగాలు గుర్తించాయి. సరిహద్దుల్లో కాపలా కాస్తున్న జవాన్లు అప్రమత్తమై కౌంటర్-డ్రోన్ వ్యవస్థలను రంగంలోకి దించడంతో ఆ డ్రోన్లు వెనక్కి తిరిగి పాకిస్తాన్ వైపు పారిపోయాయి.

డ్రోన్లు వెనక్కి వెళ్లినప్పటికీ, సరిహద్దు దాటి భారత్ వైపు ఏవైనా ఆయుధాలు, పేలుడు పదార్థాలు లేదా మత్తు పదార్థాలను జారవిడిచారా అన్న అనుమానంతో శనివారం ఉదయం నుంచి సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో కూడా డ్రోన్ల ద్వారా అక్రమ రవాణా సాగించిన సంఘటనలు ఉన్నందున, ఆర్మీ అధికారులు సరిహద్దు వెంట నిఘాను మరింత తీవ్రతరం చేశారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande