ఆంధ్రా సుగర్స్ చెరుకు శుద్ధీకరణ పరికరానికి ప్రభుత్వం నుంచి పేటెంట్
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఆంధ్రా సుగర్స్ చెరుకు శుద్ధీకరణ పరికరానికి ప్రభుత్వం నుంచి పేటెంట్
Is Jaggery or Sugar Safe for Kids? Health Risks and Benefits


తణుకు, 29 ఆగస్టు (హి.స.)

పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఆంధ్రా సుగర్స్ చెరకు శుద్ధీకరణ పరికరానికి భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ లభించింది. ఆంధ్రా సుగర్స్ సంస్థ రూపొందించిన సిరప్ శుద్ధీకరణ ప్రక్రియకు సంబంధించిన పరికరానికి 20 ఏళ్ల కాలపరిమితిలో పేటెంట్ మంజూరు చేసింది. ప్రత్యేకంగా రూపొందించిన సిరప్ క్లారిఫయర్ ద్వారా చెరకును కేవలం తొమ్మిది నిమిషాల్లో శుద్ధీకరిస్తుంది. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్లపూడి నరేంద్రనాథ్ మార్గదర్శకత్వంతో సుగర్ ప్లాంట్ ఎక్విప్మెంట్ బృందం కొన్ని సంవత్సరాలుగా కృషి చేసి పరికరాన్ని రుపొందించి, వినియోగంలోకి తీసుకువచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande